ముఖ్యమంత్రి కేసీఆర్ వరి పంట సాగులో చెబుతున్న విత్తనాలు వెదజల్లే పద్ధతి వల్ల ప్రతి ఎకరాకు ఐదు క్వింటాళ్ల పంట నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రికి తగిన సూచనలివ్వాలని కోరారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోర్కెలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
గతేడాది సన్నరకాల సాగుతో నష్టపోయిన రైతులు.. ఈసారి వెదజల్లే పద్ధతి వల్ల నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ప్రతిసారి కొత్త విధానాలతో ముఖ్యమంత్రి.. రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సేకరించి తరలించే సమయంలో వే బ్రిడ్జి రసీదులివ్వక మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారని ఆరోపించారు. లోపాయకారి విధానాలతో రైతులు ధాన్యం విక్రయాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- Eatala Rajender: నారదాసు లక్ష్మణ్ రావును అడ్డకున్న ఈటల వర్గీయులు