దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం తెచ్చిందని, దీంతో సగర్వంగా జీవించాలని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు పైలట్ ప్రాజెక్టు లబ్ధిదారులకు శుక్రవారం లేఖలు రాశారు.
నచ్చిన పనిని ప్రారంభించి అభివృద్ధి సాధించాలి
చిన్న విత్తు నుంచే మహావృక్షం ఎదిగి వికసిస్తుందని... మంచి ఆలోచనతోనే మహాద్భుతం సాధ్యమవుతుందని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా మీ బ్యాంకు ఖాత్లాలో రూ.9,90,000.. రక్షణ నిధిలో రూ.10 వేలు జమ చేసింది. ఈ మొత్తాన్ని మీకు నచ్చిన పనికి పెట్టుబడిగా వాడుకోవచ్చు. మీకు వచ్చిన పనిని ప్రారంభించి అభివృద్ధి సాధించవచ్చు. స్వయం ఉపాధితో మీరు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు అభినందనలు.
జై భీం - జై తెలంగాణ - జై హింద్
మీ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ఇదీ చదవండి: YADADRI TEMPLE: యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం