కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో తెరాస కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు రూప్‌సింగ్ కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. వివాహ భోజనం అనంతరం.. ఆయన నేరుగా కలెక్టరేట్‌గా వెళతారు. దళితబంధుపై సమీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్, ఎస్వీఎస్ విద్యా సంస్థల ఛైర్మన్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు కుమార్తె డాక్టర్ హర్షిణి వివాహం గురువారం రాత్రి హనుమకొండ జిల్లా భీమారంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇదీ చదవండి : జస్టిస్ ఎన్వీ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్