ETV Bharat / state

Gangula: తెరాసను ప్రజలే కాపాడుకోవాలి: గంగుల కమలాకర్​

భాజపా, కాంగ్రెస్‌ దిల్లీలో పుట్టిన పార్టీలని, తెరాస మాత్రం తెలంగాణలో పుట్టిన పార్టీ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula)​ అన్నారు. ఈ పార్టీని ఈ ప్రాంత ప్రజలే కాపాడుకోవాలని కోరారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని ఓ కన్వెన్షన్​ హాల్​లో జరిగిన తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

gangula kamalakar
గంగుల కమలాకర్​, హుజూరాబాద్​
author img

By

Published : Jun 16, 2021, 6:00 PM IST

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని ఓ కన్వెన్షన్​ హాల్​లో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య అతిథిగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula)​​ హాజరయ్యారు. హుజూరాబాద్‌ అంటే తెరాస, తెరాస అంటే హుజూరాబాద్‌గా మారాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనప్పటికీ మీరు వేసే ఓటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కే వేసినట్లుగా భావించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమోఘమైన అభివృద్ధి జరుగుతుంటే హుజూరాబాద్‌ నియోజకవర్గం సమస్యలకు నిలయంగా మారిందన్నారు. ఇక్కడున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నియోజకవర్గం అభివృద్ధి చూడలేదని, తన ఆస్తుల రక్షణ, అక్రమ సంపాదన కోసమే తాపత్రయ పడ్డారని విమర్శించారు.

తెరాస ఒక రైల్వే స్టేషన్‌ లాంటిదన్నారు. ఈటల రాజేందర్‌ లాంటి రైళ్లు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయని, వాటిని పట్టించుకోకూడదన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెంచిన ధర్మెేంద్ర ప్రధాన్‌తో కండువా కప్పుకున్న ఈటల రాజేందర్‌ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. భాజపా, కాంగ్రెస్‌ దిల్లీలో పుట్టిన పార్టీలని, తెరాస మాత్రం తెలంగాణలో పుట్టిందని, ఈ పార్టీని ఈ ప్రాంత ప్రజలే కాపాడుకోవాలన్నారు. ఈ సమావేశంలో హుస్నాబాద్​ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, బీసీ కమిషన్‌ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.