మున్సిపల్ కార్మికులకు నెలకు రూ. 12 వేల వేతనం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించినా చొప్పదండి కమిషనర్ అమలుచేయడం లేదని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్ ఆరోపించారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వారికి ప్రతి నెలా 1న జీతాలు ఇవ్వాలన్నారు. జీతాలు ఇవ్వలేని పక్షంలో సమ్మే చేపడతామని హెచ్చరించారు.
2018 ఆగస్టు నుంచి పీఎఫ్,ఈఏస్ఐ డబ్బు కార్మికుల ఖాతాల్లో జమచేయకపోవటం శోచనీయమన్నారు. ఈ నెల 11న సమ్మె నోటీసులు ఇవ్వనున్నామని.. స్పందించని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్