ETV Bharat / state

Huzurabad By election: సవాళ్లు చేసుకున్నారు... మరి ఎవరూ స్వీకరించలేదేం!

వాడీవేడిగా సాగిన హుజూరాబాద్​ ఎన్నికల్లో సవాళ్లు హైలైట్​గా నిలిచాయి. తెరాసపై భాజపా, భాజపాపై తెరాస నేతలు పోటీ పడి మరీ సవాల్ విసురుకున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒకరిపై ఒకరు విసురుకున్న సవాళ్లకు ప్రత్యర్థి పార్టీలు మాత్రం స్పందించ లేదు. దీనితో ఎవరు చెబుతున్నది వాస్తవమనే విషయం తెలుసుకోలేక ఓటరు మహాశయుడు గందరగోళంలో పడిపోయే పరిస్థితి నెలకొంది.

Huzurabad by election
Huzurabad by election
author img

By

Published : Oct 27, 2021, 5:31 PM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగింది. భాజపా, తెరాస నాయకులు ఒకరిని మించి మరొకరు ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో తమ ప్రభావం కోల్పోకుండా, పట్టు సడలకుండా ఉండాలని చేస్తున్న ప్రయత్నాల్లో ప్రధాన పార్టీల నాయకులు మునిగి తేలుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఒకరిపై ఒకరు విసురుకున్న ఈ సవాళ్లకు ప్రత్యర్థి పార్టీలు మాత్రం స్పందించ లేదు. కానీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్నా కొద్దీ వీరి సవాళ్ల పర్వం పెరిగిపోయింది. ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వారి అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారో చెప్పడం లేదు కానీ.. ఒక పార్టీ నాయకులు చేసిన కామెంట్లకు మరో పార్టీ నాయకులు స్పందిస్తూ సవాళ్లు మాత్రమే విసురుకుంటున్నారు.

సవాళ్లకు జవాబుగా.. ప్రతి సవాళ్లే...

భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు నాయకులు సవాళ్లు విసిరి బహిరంగ చర్చకు రావాలని తెరాస ముఖ్య నాయకులకు సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో తనతో పాటు పోటీ చేసేందుకు దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​ రావులు రావాలని ఈటల సవాల్ విసిరారు. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఈటల.. బహిరంగ చర్చకు రావాలన్నారు. హుజూరాబాద్ అభివృద్ధి విషయంలో కూడా అంబేడ్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీకి భాజపా లేఖ రాయలేదని ఇందుకు తడిగుడ్డలు కట్టుకొని తాను చెల్పూర్ పోచమ్మ గుడికి వస్తానని, సీఎం కేసీఆర్ వస్తాడా అంటూ ఈటల సవాల్ విసిరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో దళిత బంధు పథకం నిలిపివేయాలంటూ ఈటల రాసినట్టుగా వైరల్ అయిన లేఖపై స్పందించిన రాజేందర్ తాను ఆ లేఖ రాయలేదని ఫేక్ లెటర్ సృష్టించారని మండిపడ్డారు. ఈ లేఖ తాను రాసినట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని ఈటల ప్రకటించారు.

బహిరంగచర్చ కోసం ఎదురు చూసిన నేతలు

మరోవైపు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దళిత బంధు పథకాన్ని ఆపాలని తాను లేఖ రాసినట్టుగా తెరాస నాయకులు చేస్తున్న ప్రచారమంతా అబద్ధమని స్పష్టం చేశారు. హుజూరాబాద్ అంబేడ్కర్ సెంటర్‌లో బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపిస్తే తాను అక్కడే ఉరేసుకుంటానని ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మరుసటి రోజు భాజపా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు హుజూరాబాద్ అంబేడ్కర్ సెంటర్‌లో వేచి చూసి తెరాస నాయకులు రాకపోవడంతో వెళ్లిపోయారు.

ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన బండి..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దళిత బంధు స్కీం ఆపాలని రాసిన లేఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి గుడికి రావాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ ట్యాక్స్ రూ.291 రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోనే జమ అవుతున్నాయని ఈటల అన్నారు. దీనిపై మంత్రి హరీశ్​ రావు సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ ట్యాక్స్ కేంద్రం ఖజానాలో జమ అవుతున్నాయా.? లేక రాష్ట్ర ఖజానాలో జమ అవుతున్నాయో తేల్చుకునేందుకు జమ్మికుంట గాంధీ సెంటర్‌కు, హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాకు వస్తావా అంటూ సవాల్ విసిరారు. ఈ డబ్బు రాష్ట్ర ఖాతాలో చేరిందని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని, ముక్కు నేలకు రాస్తానని అన్నారు. దళిత బంధు ఆపింది భాజపా అని, ఈనెల 7న ప్రేమేందర్ రెడ్డి లేఖ రాసింది నిజమని హరీశ్​ రావు తెలిపారు. దీన్ని రుజువు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏ భాజపా నాయకుడు వస్తాడో రావాలన్నారు. తెరాస, భాజపా నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు వేసుకుంటూ ప్రకటనల వార్ మొదలుపెట్టారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాళ్లకు వేదికగా మారింది. దీనితో ఎవరు చెబుతున్నది వాస్తవమనే విషయం తెలుసుకోలేక ఓటరు మహాశయుడు గందరగోళంలో పడిపోయే పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.