రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని భాజపా నాయకులు కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఓ వైపు పనుల్లేక ఇబ్బంది పడుతుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ప్రజలపై ఎల్ఆర్ఎస్ భారం మోపడం సరికాదని భాజపా నగర అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆరోపించారు.
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద మొదట భాజపా కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లడానికి యత్నించగా పోలీసులు చెదరగొట్టారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా ధర్నా చేపట్టిన కమలం శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండిః 'ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నారు'