ETV Bharat / state

'పదవులు అనుభవించి విమర్శలు సరికాదు'

కన్నతల్లి లాంటి తెరాస పార్టీని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శిస్తున్నాడని బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

BC commission member
కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో స్థానిక నేతల సమావేశం
author img

By

Published : May 26, 2021, 1:01 PM IST

తెరాసలో అనేక పదవులను అనుభవించి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్​పై బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లి లాంటి పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో స్థానిక నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఈటల చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏడేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత సీఏం కేసీఆర్‌దేనన్నారు. బడుగు బలహీన వర్గాల వారి పేదరికాన్ని ఆసరాగా తీసుకొని భూములను లాక్కున్నది నిజం కాదా
అని ప్రశ్నించారు. ఈటల బీసీల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. మాజీ మంత్రి ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కృష్ణమోహన్‌రావు హెచ్చరించారు.

ఇదీ చూడండి: సమ్మెకు దిగిన జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.