Bandi Sanjay on Congress Government : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వాగతించారు. తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay on Ration Cards in Telangana : రాష్ట్రంలో గత పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని బండి సంజయ్(Bandi Sanjay on New Ration Cards in Telangana) అన్నారు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. మరో లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నారని చెప్పారు. వాళ్లందరికీ న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీంతో పాటు అప్పుల రాష్ట్రంగా చూపించారని, పెట్టుబడులు ఎలా తీసుకువస్తారో తెలియజేయాలని అన్నారు.
మిడ్ మానేరు బాధితుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం : బండి సంజయ్
Bandi Sanjay Interesting Comments on Six Guarantees : రాష్ట్రంలో తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలని బండి సంజయ్ కోరారు. దీంతో పాటు రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్దిదారులను గుర్తించి 6 గ్యారంటీలు(Congress Six Guarantees) అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
"బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ అప్పులు ఎలా తీరుస్తారో, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో ప్రజలకు వివరించాలి. బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించినప్పటికీ కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని ఎవరూ పట్టించుకోరు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారు."- బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులదే కీలక పాత్ర : సీఎం రేవంత్ రెడ్డి
Bandi Sanjay paid tribute to Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో ‘‘సుపరిపాలన దినోత్సవం(Good Governance Day)’’ నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈరోజుల్లో నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడని గుర్తు చేశారు.
రేషన్‌కార్డులు ఇవ్వని కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి : బండి సంజయ్
6 గ్యారంటీల కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ : మంత్రి పొంగులేటి