తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని.. కరీంనగర్లో కార్పొరేటర్ మెండి శ్రీలత, చంద్రశేఖర్, పార్టీ కార్యకర్తలు ప్రజలకు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు.
భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, కరీంనగర్ భాజపా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు కలిసి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్భాటాలకు పోకుండా మాస్క్‌లను, శానిటైజర్లను పంపిణీ చేశామన్నారు.
ఇదీ చూడండీ: ఎస్బీఐ డూప్లి'కేటు' బ్రాంచ్.. అవాక్కయిన అధికారులు