కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌ని ఏబీవీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ కాలం పెంచడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగుల విరమణ వయసు పెంపుతో ఉన్నత చదువులు చదివినా ఉపాధి దక్కడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు.