కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఓ గర్భిణి... 108 వాహనంలోనే ప్రసవించింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న చిగురుమామిడికి చెందిన రేణుకను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి.
అంబులెన్స్‌లో అత్యవసర వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న లింగమూర్తి.. పైలట్ సహాయంతో పురుడు పోశారు. అంబులెన్స్‌లోనే రేణుక... మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రానికి తీసుకెళ్లారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: గ్రేటర్ హైదరాబాద్‌లో నేటి నుంచి సీరో సర్వే