ETV Bharat / state

ఐదేళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం

ఐదేళ్ల బాలుడు... అప్పుడుప్పుడే అక్షరాలు నేర్చుకునే వయసు. కానీ ఈ వయసులోనే ఆ చిన్నారి గణితంలో ముందున్నాడు. అంతేనా వంద అడుగుల పొడవు గల పేపర్​పై 2500 సంఖ్యలను 5 గంటల 45 నిమిషాల 45 సెకండ్ల 92 మిల్లీ సెకండ్లలో పూర్తి చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు.

author img

By

Published : Jun 8, 2020, 11:01 AM IST

sai adarva got placec on wonder book of record
ఐదేళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వివేక్, సుధారాణిల రెండో కుమారుడు సాయి అధర్వ. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ పూర్తి చేశాడు సాయి అధర్వ. అతడు గణితంలో అందరికంటే ముందుగా సమాధానాలు చెప్తూ... ఉపాధ్యాయులతో శభాష్ అనిపించుకున్నాడు. గత నెల 17న లాంగెస్ట్ పేపర్ యూజ్డ్ ఫర్ సాల్వింగ్ సింగిల్ ప్రాబ్లమ్​ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

వంద అడుగుల పొడవు గల పేపర్​పై 2500 సంఖ్యలను 5 గంటల 45 నిమిషాల 45 సెకండ్ల 92 మిల్లీ సెకండ్లలో పూర్తి చేశాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఇంటర్​నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డుకు పంపించారు. స్పందించిన వారు అతి చిన్న వయసులో చేసిన రికార్డుగా నమోదు చేసినట్లు గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జిల్లా సమన్వయకర్త ప్రశంసా పత్రాన్ని, బంగారు పథకాన్ని బాలుడికి అందజేసి అభినందించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 154 కరోనా పాజిటివ్ కేసులు.. 14 మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.