Villagers protest on MSN Pharma Company in Bhiknoor : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో ఉన్న ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ వ్యర్థాలు గ్రామాల్లోని మంచి మంచి నీటి చెరువులో కలుస్తున్నాయని చుట్టుపక్కల గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ నీరు తాగడం వలన మూగ జీవులతో పాటు తాము అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు కంపెనీ తగు నివారణ చర్యలు తీసుకోవాని డిమాండ్ చేస్తూ కాచాపూర్ గ్రామస్థులు నిరవధిక దీక్ష చేపట్టారు.
వీరి నిరసన దీక్ష ఇవాళ్టీకి 58వ రోజుకు చేరుకుంది. దీంతో ఎంఎస్ఎన్ ప్రతినిధులు కాచాపూర్ గ్రామానికి వచ్చి ప్రజలతో చర్చిస్తామని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ కంపెనీ ప్రతినిధులు చర్చలకు రావాల్సి ఉండగా.. ఉదయం తొమ్మిది గంటల నుంచి గ్రామస్థులు వేచి చూశారు. మధ్యాహ్నం వరకు ప్రతినిధులు వారి వద్దకు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారు.
- ఎంఎస్ఎన్లో ముగిసిన సోదాలు.. పలు పత్రాలు స్వాధీనం
- Pollution: నిబంధనలకు నీళ్లొదలిన ఫార్మా కంపెనీలు.. కాలుష్య కోరల్లో పల్లెలు
అధిక సంఖ్యలో ప్రజలు ట్రాక్టర్లతో కంపెనీ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కంపెనీ ప్రతినిధులు చర్చలకు రావాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. కంపెనీ యాజమాన్యం వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని.. లేదంటే ఇక్కడి నుంచే వెళ్లే ప్రసక్తే లేదని ఆందోళన నిర్వహించారు. కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామస్థులకు మద్దతుగా బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ రమణారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాదాపూర్, అయ్యవారిపల్లి, సంగమేశ్వర్ గ్రామస్థులు అధిక సంఖ్యలో కంపెనీ వద్దకు వచ్చారు.
విషాన్ని విడిచిపెడుతున్న ఫార్మా కంపెనీలు: పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉన్న ప్రశాంత గ్రామాల్లో కొన్ని ఫార్మా కంపెనీలు ప్రాణాలను తోడేస్తున్నాయి. కంపెనీ లాభాలపై దృష్టి పెడుతున్న యాజమాన్యం.. వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను మాత్రం గాలికి, పక్కనే ఉన్న చెరువుల్లో, సముద్రాల్లోకి యథేచ్చగా విడిచి పెడుతున్నారు. దీంతో గాలితో పాటు నీరు, భూమి కాలుష్యానికి గురవుతోంది. భూగర్భ జలాలు విష జలాలుగా మారి మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. కొన్ని పరిశ్రమల్లో వ్యర్థాలను పక్కనే ఉన్న పంటపోలాలు, మంచినీటి చెరువులోకి విడిచిపెట్టి చేతులు కడిగేసుకుంటున్నారు.
ఫలితంగా పంటపొలాలు సర్వ నాశనం అవుతున్నాయి. భూమిలోని పీహెచ్ స్థాయిలో మారిపోయి బీడు భూములుగా తయారవుతున్నాయి. చెరువుల్లో ఉండే చేపలు మృత్యువాత పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ నీరు తాగి మనుషులు మృతి చెందిన ఘటనలు లేకపోలేదు. అనేక సందర్భంలో మత్సకారులు ఆందోళన చేసి అలాంటి ఫార్మా కంపెనీలు మూసి వేయాలని ముందుకు వచ్చిన ఘటనలు లేకపోలేదు. మరికొన్ని పరిశ్రమల్లో వాటి వ్యర్థాలను ప్రత్యేక పద్ధతిలో రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న కంపెనీలు అనేకం.
ఇవీ చదవండి: