ఉరుసు ఉత్సవాలను శనివారం రోజున భక్తులు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బిజ్జల్ వాడి, కత్తల్వాడి గ్రామాల మధ్య ఉన్న దర్గా వద్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
యువకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దర్గా వద్ద పూజలు చేసిన భక్తులు చక్కెర, బెల్లం పంచుతూ వారివారి మొక్కులను తీర్చుకున్నారు. ఏళ్ల క్రితం బిజ్జల్ సాబ్, కత్తల్ సాబ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దర్గాను ఏర్పాటు చేయడం వల్ల వారి పేర్లనే ఈ గ్రామాలకు పెట్టినట్లు పూర్వీకులు చెబుతారు.
ఇవీ చూడండి: 'చట్టసభల కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలి'