కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎలుపుగొండలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో బోరు మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్తో ముగ్గురు రైతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎలుపుగొండ శివారులో బోరు మోటారు బయటకు తీయడానికి వెళ్ళి గ్రామానికి చెందిన మురళీధర్ రావు(55), ఇమ్మడి నారాయణ(40) లక్ష్మణ్ రావు(60) మరణించారు. రైతుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- ఇదీ చూడండి : విహారయాత్రకు వెళ్లి.. గల్లంతయ్యాడు