మనిషి మనుగడకు చెట్లే ఆధారమని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డిలోని పోలీసు శాఖ హరిత రక్షక వనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్‌తో కలిసి స్పీకర్ మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 82 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో 6 ఎకరాల స్థలంలో 3500 మొక్కలు నాటడం అభినందనీయమని ఎస్పీ శ్వేతారెడ్డిని ప్రశంసించారు.
చెట్లు లేకపోతే వేడి పెరిగి మంచుకొండలు కరిగి... జలప్రళయం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని స్పీకర్ వివరించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏడాదికి లక్ష మొక్కల చొప్పున 5 ఏళ్లలో 5 లక్షల మొక్కలు నాటాలని నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ నిట్టు జాహ్నవికి సూచించారు.
ఇదీ చూడండి: కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!