అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణకు చేపట్టిన శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని చిత్ర పటంతో రథయాత్ర నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రజలు, చిన్నారులు, యువతీయువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. రామ మందిర నిర్మాణం హిందువుల కల అని.. ఆ కలను సాకారం చేసుకునే అవకాశం రావడం సంతోషమని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. నిర్మాణానికి ప్రజలు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: 'కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేసీఆర్ దోషనివారణ పూజలు చేశారు'