కామారెడ్డి జిల్లా లింగంపేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుభాష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు మార్పిడి కోసం 4,500 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు మహ్మద్ బషీరుద్దీన్ అనిశాను ఆశ్రయించాడు.
బుధవారం సాయంత్రం 3వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుభాష్‌ను పట్టుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని నిందితుడి నివాసంలో ఏసీబీ సీఐలు శంకర్ రెడ్డి, శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.