కామరెడ్డిలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటలు తడిసిపోయాయి. ఆరబోసిన పసుపు, మొక్కజోన్న పంటలు తడిసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. వర్షం వచ్చినపుడు టార్పలీన్లు లేక నానా అవస్థలు పడుతున్నామని అన్నదాతలు తెలిపారు. వర్షం నీటిలో మొక్కజొన్న కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. రైతులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు