కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. రైతుల నుంచి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.
జిల్లాలోని రాజంపేట, ఎల్లంపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఎల్లంపేట్ గ్రామంలోని మహాలక్ష్మి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ ప్రేమ్‌కుమార్, కామారెడ్డి ఎంపీపీ ఆంజనేయులు, సొసైటీ ఛైర్మన్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.