ETV Bharat / state

'ఆదుకునే నాథులు లేరు... చికిత్స ఎలా చేయించాలో తెలియదు' - చికిత్స కోసం ఎదురుచూపులు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ఎదుట...శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇద్దరు వృద్ధ దంపతులు వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఎటుపోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

old-couple-waiting-for-help-at-kamareddy-hospital
'ఆదుకునే నాథులు లేరు... చికిత్స ఎలా చేయించాలో తెలియదు'
author img

By

Published : Apr 17, 2021, 11:53 AM IST

నిజామాబాద్​లోని ఆర్మూర్ పట్టణానికి చెందిన నారాయణ, లక్ష్మీ వృద్ధ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా... ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. దీంతో పోషించేవారు లేక... బతుకుదెరువు కోసం ఉపాధి వెతుక్కుంటూ మెదక్ జిల్లాలోని అక్కన్నపేట్​లో పనికి కుదిరారు. ఈ క్రమంలోనే నారాయణకు మెడపై పెద్ద కణతి ఏర్పడింది.

చికిత్స కోసం రామాయంపేట్​ వెళ్లగా అక్కడ వైద్యులు చికిత్స చెయ్యలేమని తెలిపారు. అనంతం ప్రభుత్వ అంబులెన్స్​లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కానీ ఇక్కడ పట్టించుకునే నాథుడే లేకపోవడంతో చేసేదేమి లేక ఎండలోనే పడిగాపులు కాసి... వైద్యుల వద్దకు వెళ్లగా... నిజామాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. నివ్వెరపోయిన దంపతులు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చూడండి: మరో 100రోజుల వరకు కరోనా ముప్పు: వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.