కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 13 లక్షల 1508 రూపాయల విలువ చేసే చెక్కులను 13 మంది లబ్ధిదారులకు అందజేశారు.
కేసీఆర్.. పేదింటి ఆడపిల్లల కోసం చేపట్టిన ఈ పథకం ఎంతో మందికి ఉపయోగపడుతోందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల వల్ల రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య చాలా వరకు తగ్గిందని ఎమ్మెల్యే సురేందర్ వివరించారు.
ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'