ETV Bharat / state

కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్.. మావి న్యూట్రిషన్​ పాలిటిక్స్ : మంత్రి హరీశ్​రావు - Nutrition Kits distribution in Telangana

Nutrition Kits distribution in Telangana : రాష్ట్రంలోని గర్భిణీలకు రక్తహీనత ఉండకూడదనే ఉద్దేశంతోనే పౌష్టికాహార కిట్లు అందిస్తున్నామని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రతి గర్భిణీకి రెండు సార్లు కిట్‌ అందిస్తామని.. కిట్‌లోని ఆహారాన్ని తప్పక తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్​ నుంచి ఈ కార్యక్రమాన్ని వర్చువల్​గా ప్రారంభించారు.

harish rao
harish rao
author img

By

Published : Dec 21, 2022, 1:18 PM IST

కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్.. మావి న్యూట్రిషన్​ పాలిటిక్స్: మంత్రి హరీశ్​రావు

Nutrition Kits distribution in Telangana : గర్భిణీల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు సర్కారు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్​లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు వర్చువల్​గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలో మాతా-శిశు మరణాలు బాగా తగ్గాయని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్​ బృహత్తర ప్రణాళికతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రానివి పార్టిషన్ పాలిటిక్స్.. తమవి న్యూట్రిషన్​ పాలిటిక్స్​ అని స్పష్టం చేశారు. పేద మహిళల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడిన మంత్రి.. తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్‌ ఇస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు రక్తహీనత ఉండకూడదనే ఈ కిట్‌ పంపిణీ చేస్తున్నామన్న ఆయన.. పౌష్టికాహార కిట్‌లోని ఆహారాన్ని తల్లులు తప్పక తీసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీకి రెండు సార్లు కిట్‌ అందిస్తామని.. తల్లీబిడ్డల క్షేమం కోరే ఈ పౌష్టికాహార కిట్‌ అందిస్తున్నామని మంత్రి వివరించారు.

"తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్‌ ఇస్తున్నాం. గర్భిణులకు రక్తహీనత ఉండకూడదనే ఈ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి గర్భిణికి రెండుసార్లు పౌష్టికాహార కిట్‌ అందిస్తాం. కిట్‌లోని ఆహారాన్ని తల్లులు తప్పక తీసుకోవాలి. పేద మహిళల గురించి ఆలోచించి ఈ కిట్ రూపొందించాం. కేంద్రానివి పార్టిషన్​ పాలిటిక్స్.. మావి న్యూట్రిషన్​ పాలిటిక్స్." - మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రక్తహీనత నమోదవుతున్న ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల, కామారెడ్డి, కుమురుం భీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్​ల‌లో ఈ రోజు నుంచి న్యూట్రిషన్ కిట్​లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు న్యూట్రిషన్ కిట్​లను పంపిన సర్కారు.. నేడు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో గర్భిణీలకు కిట్​లను అందిస్తోంది. సుమారు రూ.50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ధి చేకూరనుంది.

ఇవీ చూడండి..

నేటి నుంచి కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల పంపిణీ

మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్రం.. రాష్ట్రాలకు కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.