ETV Bharat / state

'చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి' - పెద్దమల్లా రెడ్డి గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే గంపగోవర్ధన్​

బీసీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లాలోని పెద్దమల్లా రెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు.

kamareddy-mla-gampa-goverdan-inaugurate-raituvedika-in-paddamallareddy-village
'చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి'
author img

By

Published : Jan 24, 2021, 11:04 PM IST

చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లోలోని భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​ బీసీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పిల్లల ఉన్నతికోసం గురకులాలను నెలకొల్పారని వివరించారు. ఈ సందర్భంగా సమాజంలోని వివక్షపై చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: డ్యూటీలో నేరస్థుల వేట.. గ్రౌండ్​లో క్రికెట్ ఆట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.