కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ముందు శానిటైజేషన్, పారిశుద్ధ్య, వాచ్మెన్లు సమాన జీతాల కోసం ధర్నా చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసినా.. జీతాలు పెంచకుండా అరకొర వేతాలు ఇవ్వడం సరికాదని ఆగ్రహించారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో ధరలు పెరిగిన పరిస్థితుల్లో బతకడం కష్టంగా ఉందని వాపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మికులందరికీ రూ.18వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనా నివారణ కోసం పనిచేస్తున్న తమకు.. రెండు నెలల జీతాలు అదనంగా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మద్యం దుకాణాలు తెరిచారు కానీ.. ప్రజల ప్రాణాలు కాపాడే తమ గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!