కేంద్ర ప్రభుత్వం సూచించిన నియమాల ప్రకారం.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేయడం వల్ల రాకపోకలు తిరిగి ప్రారంభయ్యాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్ పూర్ మహారాష్ట్ర సరిహద్దు వద్ద రెండు రాష్ట్రాల తనిఖీ కేంద్రాలు ఎత్తివేశారు. రాత్రి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వాహనాలు భారీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్న రహదారి.. వాహనాలతో సరిహద్దు ప్రాంతం సందడిగా మారింది.
కరోనా నేపథ్యంలో..
గత కొన్ని రోజులుగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల రవాణా, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తమై.. తెలంగాణలోకి ప్రవేశించే సరిహద్దులను మూసేశారు. మహారాష్ట్ర నుంచి కేవలం పాలు, కూరగాయలు, నిత్యావసర సరకులు, ఔషధాలు, అంబులెన్స్‌లను మాత్రమే, తనిఖీల అనంతరం రాష్ట్రంలోకి అనుమతించారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్‌కి రైతన్న బహుమానం