Kamareddy Assembly Election Results 2023 : రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలలో ఎవరినోటా విన్నా ఒకటే పేరు వినబడుతుంది.. అదే కామారెడ్డి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులుగా ఉన్న గత సీఎం కేసీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి.. అలాంటి దిగ్గజాలు ఇద్దరినీ ఒకేసారి ఓడించి విజయఢంకా మోగించారు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌పై 6,741 ఓట్ల ఆధిక్యంతో గెలిచి దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన కేవీఆర్ తన రాజకీయ యాత్రను కాంగ్రెస్‌తో ప్రారంభించారు. 2004లో నిజామాబాద్ జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక మండలి సభ్యునిగా చేశారు.ఆ తర్వాత జిల్లా పరిషత్ ప్రాంతీయ మండలి సభ్యునిగా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) మరణం తర్వాత, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఆర్ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)కి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణారెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు.
Katipally Venkata Ramana Reddy won in Kamareddy : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి రమణారెడ్డి ఓడిపోయారు. అయినా తర్వాత పంచాయతీ, పురపాలకసంఘ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రమించారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులతో కలిసి పోరాడి.. దాన్ని రద్దు చేయించారు. ధరణి పోర్టల్‌లో సమస్యలు పరిష్కరించాలని, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీ నిధులు మంజూరుచేయాలని ఉద్యమాలు చేపట్టారు. గత ఏడాది కాలంగా నియోజకవర్గమంతా కులసంఘాల భవనాలను, దేవాలయాలను సొంత నిధులతో నిర్మిస్తున్నారు. అన్నివర్గాల ప్రజల ఆమోదం పొంది.. ప్రస్తుత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.
కేసీఆర్ హ్యాట్రిక్ విన్‌కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?
కేసీఆర్ ఓటమికి కారణాలు : కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కారణం స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య కుమ్ములాటలనే భావిస్తున్నారు. దీనికితోడుగా కామారెడ్డిలోని భూములను స్వాధీనం చేసుకోవడానికే కేసీఆర్ ఇక్కడ పోటీచేస్తున్నారని ప్రతిపక్షాల పార్టీలు జోరుగా ప్రచారం చేశారు. దీన్ని అక్కడి బీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టలేకపోయారు.
కామారెడ్డిలో పోటీచేసిన కేసీఆర్ పూర్వీకుల గ్రామం (అమ్మ ఊరు) అయిన బీబీపేట మండలం కోనాపూర్‌లో బీఆర్ఎస్కే ఆధిక్యం లభించింది. గ్రామంలో 819 ఓట్లు ఉండగా 742 ఓట్లు పోలయ్యాయి. వీటిలో బీఆర్ఎస్కు 397 ఓట్లు, కాంగ్రెస్‌కు 152, బీజేపీకు 101, ఇతరులకు 88, నోటాకు 4 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్కు 245 ఓట్ల ఆధిక్యం లభించింది.
రేవంత్ రెడ్డి ఓటమికి కారణాలు : కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా లేకపోవడంతో దీంతో కొన్ని గ్రామాల్లో ఆ పార్టీకి ప్రచారాలు సరిగాజరగలేదని అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులందరూ 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండే మాజీ మంత్రి షబ్బీర్‌అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీంతో అక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోయారు.
తెలంగాణలో నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్ సర్కార్ - సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం!
కేసీఆర్ హ్యాట్రిక్ విన్‌కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?