కామారెడ్డి జిల్లా బిర్కుర్ మండలానికి చెందిన రాజు, నాగరాజు, నర్సింలునే డీలర్లు.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ అధికారులకు దొరికిపోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం బయ్యారం, కేసముద్రం, పెద్దవంగం, భద్రాద్రికొత్తగూడెంలకు చెందిన డీలర్లతో వీరు కుమ్మక్కై 173 మందికి ఇచ్చే ఉచిత బియ్యాన్ని గత కొద్ది నెలలుగా దారిమళ్లిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాయబ్, తహసీల్దార్ ప్రవీణ్, మజీద్, గణేష్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బిర్కుర్ రేషన్ దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. డీలర్లను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటకువచ్చాయి. ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందించే ఆహారభద్రత కార్డులను ఉపయోగించి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నట్టు వారు అధికారుల వద్ద ఒప్పుకున్నారు. వీరికి సహకరించిన వీఆర్ఏలు లింగం, రవి, గంగాధర్లతోపాటు ముగ్గురు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ