కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయపల్లి, బ్రాహ్మణపల్లి, శివనగర్, రుద్రారం గ్రామాల్లో వడగండ్ల వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో గ్రామాల్లోని వరి పొలాలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంటలు కళ్లముందే దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రారంలో పంట పొలాల్లో పిడుగుపాటుకు భారీ వృక్షం నేలకొరిగింది. పలుచోట్ల ఇంటిపైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. ఏపుగా పెరిగిన పంటలు కళ్లముందే నీటి పాటు అవుతుంటే కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఆరో రోజుకు చేరిన టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె