కామారెడ్డి జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మాచారెడ్డి మండలంలోని ఆరేపల్లిలో అత్యధికంగా 80 ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట పాడైపోయింది.
ఒక్కొక్క రైతు ఎకరానికి సుమారు రూ. 40 వేల వరకు ఖర్చు చేసి పంటలను సాగుచేశారు. పందులు, కత్తెర పురుగుల దాడి నుంచి కాపాడుకున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో ఈ అకాల వర్షం వారిని నిండా ముంచేసింది. ఫలితంగా ప్రభుత్వం తమను ఆదుకొని.. నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..