ETV Bharat / state

Distorted midday meals: వికటించిన మధ్యాహ్న భోజనం... 50 మంది చిన్నారులకు అస్వస్థత

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల పరిషత్‌ బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని డాక్టర్లు పేర్కొన్నారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

Distorted midday meals
Distorted midday meals
author img

By

Published : Oct 28, 2021, 12:17 PM IST

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల పరిషత్‌ బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు. సరియైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. పిల్లలందరు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు పేర్కొన్నారు. పాఠశాలను సందర్శించి విచారణ చేపడతామని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నాసిరకం పదార్థాలు వినియోగిస్తే ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విచారణ చేపట్టి బాధ్యులైన వారిని తొలగించాలని ఆదేశించారు.

కొరవడిన పర్యవేక్షణ..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనం తయారీతో పాటు విద్యార్థులకు వడ్డించే సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. వినియోగించే పదార్థాలను నిత్యం తనిఖీ చేయాలి. క్షేత్రస్థాయిలో ఏజెన్సీ నిర్వాహకుల మీద నమ్మకంతో వదిలేస్తున్నారు. సాంబారులో అతిగా కారం వేయడం, నాసిరకం నూనె వాడిన కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బీర్కూర్‌లో కుళ్లిన కోడిగుడ్లు ఇవ్వడం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడినట్లు సమాచారం.

ఇదీ చదవండి: Street Dogs were Killed : వీధికుక్కలకు విషమిచ్చి చంపారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.