ETV Bharat / state

Farmers Demand Cancellation of Master Plan : 'మాస్టర్​ ప్లాన్' రద్దు చేయకపోతే.. కేసీఆర్​పై పోటీకి రెడీ - Political Heat in Kamareddy

Farmers Demand Cancellation of Master Plan in KamaReddy : కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇప్పుడు ఎన్నికల అంశంగా మారింది. ఈ ప్లాన్​తో భూములు కోల్పోతున్న రైతులు.. ఇప్పుడు కేసీఆర్​పై పోరుకు సిద్ధమయ్యారు. మాస్టర్ ప్లాన్​ రద్దు చేయాలని లేకుంటే.. తాము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని బాధితులు తెలిపారు. ప్రతి గ్రామానికి తిరిగి కేసీఆర్​కు వ్యతిరేకంగా ఉద్యమం తీసుకువస్తామని హెచ్చరించారు.

Farmers Movement Against CM KCR
100 Naminations Againist CM KCR in Kamareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 5:19 PM IST

Farmers Demand Cancellation of Master Plan in KamaReddy : కామారెడ్డిలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​(CM KCR)కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గం అన్నదాతలు నామినేషన్లు(Farmers Namination) వేస్తామని ప్రకటించారు. జిల్లాలో రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మాస్టర్​ ప్లాన్ ఇందుకు కారణం. మాస్టర్ ప్లాన్​లో భూములు కోల్పోతున్న రైతులంతా ఇప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడ్డారు. ఇవాళ లింగాపూర్​ గ్రామంలో సమావేశం నిర్వహించారు.

Farmers Participate in Elections in Kamareddy : కార్యక్రమంలో రైతులు పలు అంశాలపై చర్చించుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అనంతరం భూములు కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని రైతులు తేల్చి చెప్పారు. మాస్టర్​ ప్లాన్ రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. కామారెడ్డి(KAMAREDDY)లో తనుకు పని ఉందని.. అందుకే అక్కడ పోటీ చేస్తున్నారని.. గజ్వేల్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద సమావేశంలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీంతో కామారెడ్డిలో కేసీఆర్​కు ఏం పని ఉందని ప్రశ్నించారు. గజ్వేల్​లో భూములు అయిపోయాయి.. ఇక్కడి ఆ పనిమీదనే వస్తున్నారా అని ఎద్దేవా చేశారు.

kamareddy master plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు

100 Naminations Againist CM KCR in Kamareddy : కామారెడ్డిలో మాస్టర్​ ప్లాన్​ వల్ల భూమి కోల్పోతున్నానని ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. అలాంటి ఘటనలు పునరావృతం కాకముందే కేసీఆర్​ స్పందించాలని రైతులు డిమాండ్ చేశారు. మాస్టర్​ ప్లాన్(Master Plan)​ రద్దు చేస్తానని ప్రకటించిన తరవాతే కేసీఆర్​ కామారెడ్డి నియోజకవర్గానికి రావాలని సూచించారు. గవర్నర్​ ద్వారా ఆ ప్లాన్​ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇలా చేయకపోతే ప్రతి గ్రామం నుంచి 15 చొప్పున కేసీఆర్​పై 100 నామినేషన్లు వేస్తామని స్పష్టం చేశారు.

Farmers Movement Against CM KCR : నామినేషన్లు వేసేందుకు రైతులందరూ పార్టీలకు అతీతంగా సంఘటితం అవుతామని.. 9 గ్రామాల్లో అన్నదాతలకు సంబంధించిన బంధువులతో కలిసి ముందుకు సాగుతామని వివరించారు. 9 గ్రామాల్లోనే కాకుండా నియోజకవర్గం మొత్తం వారందరు కలిసి తిరిగి కాళ్లు మొక్కి అయినా.. కేసీఆర్​కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్లకు ఎవరైతే మద్దతు ఇస్తారో వారికే ఓటు వేస్తామని స్పష్టం చేశారు.

"కేసీఆర్​ మాస్టర్​ప్లాన్​ ఎత్తివేసి కామారెడ్డికు రావాలని డిమాండ్​ చేస్తున్నాం. ఎత్తివేస్తేనే కేసీఆర్​కు ఓటు వేస్తాం. లేదంటే మేమందరం కలిసి 100 నామినేషన్లు వేసి పోటీ చేస్తాం."-మాస్టర్​ ప్లాన్ బాధితుడు

What is Kamareddy Master Plan : కామారెడ్డి మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన టెకిర్యాల్, కాల్సిపూర్, అడ్లూర్, లింగాపూర్, కాల్సిపూర్, పాతరాజంపేట, సరంపల్లి, రామేశ్వరపల్లి గ్రామాల్లో 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్​ను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ సంస్థ ప్రణాళిక రూపొందించింది. దీన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలు ప్రతిపాదించారు. దీనిలో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. ఇల్సిపూర్, అడ్లూర్, టెకిర్యాల్ గ్రామలకు చెందిన 900 ఎకరాలను చూపించారు. దీంతో భూములకు ఒక్కసారిగా డిమాండ్​ పడిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు దిగి.. ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు.

'మాస్టర్​ ప్లాన్' రద్దు చేయకపోతే.. కేసీఆర్​పై పోటీకి రెడీ

కామారెడ్డి 'మాస్టర్ ప్లాన్' రగడ.. హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన రైతులు

కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​.. భూమి పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.