కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో సార్వజనిక్ గణేష్ మండలి ఉత్సవాలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఏటా భారీ ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలందిస్తారు. తొలిసారి 1954లో గణేష్ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం ఎడ్ల బండిపైన తీసుకెళ్లి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ఊరు మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున ఇక్కడివారు ఎక్కువగా ఆ రాష్ట్ర సంప్రదాయాలను పాటిస్తుంటారు.
ఇదీ చదవండిః పంజాబ్‌లో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం!