కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని జెండా వీధిలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. విచక్షణారహితంగా దాడి చేసి ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలను తీవ్రంగా గాయపర్చాయి. గాయపడిన వారికి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
వారిలో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిచ్చికుక్కల బెడదను అరికట్టాలని జెండాకాలనీ వాసులు కోరుతున్నారు.