ETV Bharat / state

పర్యాటకుల కోసం కల్కి చెరువును తీర్చిదిద్దుతున్నాం : పోచారం భాస్కర్​రెడ్డి - బాన్సువాడలో మరుగుదొడ్లను ప్రారంభించిన డీసీసీబీ అధ్యక్షులు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని కల్కి చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్​రెడ్డి తెలిపారు. మినీ ట్యాంక్​బండ్​కు వచ్చే ప్రజల కోసం నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ఆయన ప్రారంభించారు.

DCCB presidents inaugurating toilets at Kalki pond in bansuwada kamareddy dist
పర్యాటకుల కోసం కల్కి చెరువును తీర్చిదిద్దుతున్నాం : పోచారం భాస్కర్​రెడ్డి
author img

By

Published : Dec 4, 2020, 4:07 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కల్కి చెరువు మినీ ట్యాంక్​బండ్​ వద్ద నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్​రెడ్డి ప్రారంభించారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మినీ ట్యాంక్​బండ్​కు వచ్చే పర్యాటకుల ఆహ్లాదం కోసం ప్రత్యేకంగా రూ.20 లక్షల రూపాయల ఖర్చుతో తెప్పించిన 24 సీట్ల సామర్థ్యం గల ఆధునాతన బోటును భాస్కర్​రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, పురపాలక ఛైర్మన్​ జంగం గంగాధర్, వైస్​ఛైర్మన్ జుబేర్​, ఎంపీపీ దొడ్ల వెంకట్​రామిరెడ్డి, పీఎసీసీఎస్​ ఛైర్మన్ కృష్ణారెడ్డి, పెరిక శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు మోహన్​ నాయక్​, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.