ETV Bharat / state

'నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేస్తాం' - రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువులో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బోటు ను ప్రారంభించారు. భవిష్యత్తులో నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేస్తామని తెలిపారు.

Chairman Pocharam Srinivas Reddy inaugurated the boat at Banswada Kalki pond in Kamareddy district.
'నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేస్తాం'
author img

By

Published : Jan 8, 2021, 10:14 PM IST

బాన్సువాడ కల్కి చెరువును మినీ ట్యాంక్ బండ్​గా తీర్చిదిద్దామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బోటును ప్రారంభించిన ఆయన.. పట్టణ ప్రజల సౌకర్యం కొసం ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

పర్యాటక కేంద్రంగా ..

భవిష్యత్తులో మినీ ట్యాంక్ బండ్ వద్ద పార్కును ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ తెరాస ఇన్ ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి , అధికారులు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

'కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు 6 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్​గా తీర్చిదిద్దాం. భవిష్యత్తులో పట్టణ ప్రజలు పిల్లాపాపలతో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించే పర్యాటక కేంద్రంగా రూపొందిస్తాం' .

-పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి

ఇదీ చదవండి: ఆస్తుల కోసం మమ్మల్ని ఇంతలా వేధిస్తారా? : భూమా మౌనిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.