ETV Bharat / state

కన్న కూతురు, అన్న కూతురు, అన్న.. ముగ్గురి హత్య - కన్న కూతురు, అన్న కూతురు, అన్న.. ముగ్గురి హత్య

కుటుంబంలో ఆడబిడ్డకు తనకు నచ్చని ప్రేమ పెళ్లి జరిగింది. అది సహించలేకపోయాడు. మరోసారి అలాంటివి జరగొద్దంటే కుటుంబసభ్యులను చంపేయటమే మార్గమనుకున్నాడు. ఉన్మాదిగా మారాడు. కన్నకూతుర్ని, అన్నకూతుర్ని, అన్నను నమ్మించి గొంతు కోశాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులో శనివారం వెలుగు చూసిన ఈ మూడు హత్యల ఉదంతం సంచలనం సృష్టించింది.

కన్న కూతురు, అన్న కూతురు, అన్న.. ముగ్గురి హత్య
author img

By

Published : Oct 13, 2019, 8:03 AM IST

Updated : Oct 13, 2019, 9:37 AM IST

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. దోమకొండలో ముగ్గుర్ని కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. శనివారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. మృతుల వివరాల గురించి ఆరా తీశారు. మృతులు బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బందెల బాలయ్య, ఆయన కూతురు లత, తమ్ముడు రవి కుమార్తె చందనలుగా గుర్తించారు.

ప్రేమ వివాహం చేసుకుందని...

బందెల బాలయ్య, బందెల రవి అన్నదమ్ములు. గ్రామంలో కూలీపనులు చేసుకొంటూ జీవిస్తున్నారు. ఇటీవల బాలయ్య పెద్ద కుమార్తె దీప అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. తన భార్య తరఫు బంధువుల అబ్బాయిని దీప ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని రవి జీర్ణించుకోలేకపోయాడు. వారి ముందు విలువ తగ్గుతుందని కుటుంబసభ్యులతో గొడవ పడగా.. కులపెద్దలు రవిని సముదాయించారు. కానీ రవి పగ మాత్రం చల్లారలేదు. అన్న రెండో కుమార్తె లత, తన కుమార్తె చందనను మట్టుబెట్టాలని దురాలోచన చేశాడు. ప్రేమ వివాహాన్ని అడ్డుకోని అన్ననూ కడతేర్చాడు.

పక్కా ప్రణాళికతో..

ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై గ్రామం పక్కనే ఉన్న దోమకొండ శివారులోని మల్లికార్జునస్వామి ఆలయ పరిసరాలకు ముగ్గుర్నీ నమ్మించి తీసుకెళ్లాడు. ముందస్తుగానే శీతలపానీయంలో పురుగుల మందు కలిపి బాలయ్య, లత, చందనలకు తాగించాడు. వారు మత్తులోకి వెళ్లగానే బ్లేడుతో బాలయ్య, లతల గొంతు కోసినట్లు తెలుస్తోంది. చందన అప్పటికే మృతిచెంది ఉండటంతో ఆమె గొంతు కోయలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా హత్యకు గురికావటం గ్రామంలో విషాదం నింపింది.

కన్న కూతురు, అన్న కూతురు, అన్న.. ముగ్గురి హత్య

ఇవీచూడండి: అవ్వా...నీరు కావాలంటూ వచ్చాడు..దోచుకెళ్లాడు

tg_nzb_04_12_murder_av_3180033 Reporter: Srishylam, eenadu contributor: balakishan (domakonda) (. ) కామారెడ్డి జిల్లా దోమకొండలో దారుణం జరిగింది. దోమకొండ శివారు ప్రాంతంలో ఇద్దరు బాలికలు సహా ముగ్గురు హత్య గురయ్యారు. మృతులు బిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందినవారి గా గుర్తించారు. బందెల బాలయ్య(46), బాలయ్య కూతురు లత(15), బాలయ్య తమ్ముడు రవి కుమార్తె చందన(5)లను శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, అనంతరం గొంతు కోసి చంపేశారు. నిన్న సాయంత్రం దోమకొండ అటవీ ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై బాలయ్య, అతని తమ్ముడు రవి లు తమ కుమార్తెలతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో బాలయ్య తమ్ముడు రవి కనిపించకపోవడంతో అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.... vis
Last Updated : Oct 13, 2019, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.