కొవిడ్ మృతుల.. మృతదేహాల పరిస్థితి దయనీయంగా ఉంది. అయినవారే మృతదేహాన్ని తీసుకోడానికి ముందుకు రావడం లేదు. చాలాచోట్ల శ్మశానాల్లోనే పడేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మృతదేహం కరోనాతో చనిపోయిన వ్యక్తిదని తెలిసినా... నా అన్న వాళ్లు ఎవ్వరూ ముందుకు రాకపోయినా.. అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించాడో అంబులెన్స్ డ్రైవర్.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లికి చెందిన ఓ యువకుడు కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రి నుంచి అతని ఇంటికి తీసుకెళ్లగా.. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవ్వరూ ముందుకు రాలేదు. అంబులెన్స్ డ్రైవర్ షఫీ, మరో యువకుడితో కలిసి అంత్యక్రియలు నిర్వహించాడు. తన అంబులెన్స్‌లోనే బాన్సువాడలోని హిందూ శ్మశాన వాటికకు తీసుకువెళ్లి హిందూ సాంప్రదాయ ప్రకారం అంతక్రియలు జరిపి మానవత్వాన్ని చాటుకున్నాడు.
ఇదీ చూడండి: పేలుడు.. హైడ్రోపెరాక్సైడ్‌గా అనుమానం