కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ సీఐ టాటా బాబు అవినీతి బాగోతం బయటపడింది. నసురుల్లాబాద్ మండలంలోని పోలీస్ స్టేషన్‌లో ఓ సివిల్ కేసు విషయంలో గుత్తేదారు ప్రతాప్ సింగ్‌ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు 50 వేలు డిమాండ్ చేశారు.
చివరికి రూ.20 వేలకు ఒప్పందం కుదరడంతో మొదట పదివేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. బాధితునికి లంచం ఇవ్వడం ఇష్టంలేక అనినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడు పదివేలు ఇస్తుండగా సీఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు.