ETV Bharat / state

కళ్లకు గంతలు కట్టుకొని ఏబీవీపీ నిరసన - ఏబీవీపీ

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్​మెంట్ రాక వేలకు వేలు కట్టి ధ్రువపత్రాలు తీసుకోవాల్సి వస్తుందని ఏబీవీపీ భిక్కనూరు మండల కన్వీనర్ గంధం సంజయ్ అన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

abvp protest in kamareddy district bhikkanur mandal collage
కళ్లకు గంతలు కట్టుకొని ఏబీవీపీ నిరసన
author img

By

Published : Sep 30, 2020, 1:03 PM IST

రాష్ట్రంలో స్కాలర్​షిప్​, రీయింబర్స్​మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు పైచదువులకు వెళ్లడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బిక్కనూరు మండల కన్వీనర్ గంధం సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని ఆందోళన చేపట్టారు.

వేలకు వేలు కట్టి ధ్రువ పత్రాలు తీసుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సమీర్, శివ, రాజు, భాస్కర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఖైరతాబాద్​ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రావెల్స్​ నిర్వాహకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.