ETV Bharat / state

ముగిసిన తుంగభద్ర పుష్కరాలు.. తగ్గిన భక్తుల రద్దీ - gadwal news

తుంగభద్ర పుష్కరాలు ముగిశాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నాలుగు ఘాట్లలో.. సుమారు 4 లక్షల 10 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. 12 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. పుష్కరాలను ఘనంగా నిర్వహించినందుకు అధికారులను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అభినందించారు. కొవిడ్‌ సమయంలో సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన తుంగభద్ర పుష్కరాలు.. తగ్గిన భక్తుల రద్దీ

author img

By

Published : Dec 2, 2020, 5:37 AM IST

Updated : Dec 2, 2020, 5:50 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తుంగభద్ర పుష్కారాలు ముగిశాయి. చివరి రోజు తుంగభద్ర నదికి మహహారతి ఇచ్చి వాయనం సమర్పించడంతో ఉత్సవాలు ముగించారు. నవంబర్‌ 20న మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పుష్కరాలను ప్రారంభించారు. అలంపూర్‌, పుల్లూరు, రాజోళి, వేణిసోంపురంలో ఘాట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 4 లక్షల 10వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. అత్యధికంగా అలంపూర్‌లో 2 లక్షల మంది, రాజోళిలో లక్ష, పుల్లూరు ఘాట్‌లో 79 వేల మంది, వేణి సోంపూర్‌లో 33 వేల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

సకల ఏర్పాట్లు..

పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే.... నదీ స్నానానికి అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరి రోజున నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు కుటుంబ సభ్యులతో కలిసి అలంపూర్‌ ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబసమేతంగా పుష్కర స్నానాలు చేశారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని మాస్క్‌లు ధరించిన వారినే అధికారులు ఘాట్లకు, ఆలయాలకు అనుమతించారు. శానిటైజేషన్‌తో పాటు మరుగుదోడ్లు, మూత్రశాలలు, వైద్య శిబిరాలు, దుస్తులు మార్చుకునే గదులు అందుబాటులో ఉంచారు.

తగ్గిన భక్తుల రద్దీ..

గత పుష్కరాలతో పోలిస్తే కరోనా కారణంగా భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. 2008లో జరిగిన పుష్కరాల్లో... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

తుంగభద్ర పుష్కరాల కోసం దేవాదాయశాఖ రెండున్నర కోట్లు విడుదల చేసింది. పుష్కర ఘాట్లు, ఆలయాల వద్ద తాత్కాలిక ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు సైతం కొవిడ్‌పై అవగాహన, ప్లాస్టిక్‌ నివారణ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టి భక్తులకు సహాయ సహకారాలు అందించాయి.

ఇవీచూడండి: టెందుకు సోదరా... ఆరు కొట్టింది పోదాం పదరా...!

Last Updated : Dec 2, 2020, 5:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.