తెరాసలో పనిచేసే ప్రతి కార్యకర్తను అధిష్ఠానం గుర్తించి వారికి సముచిత న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. పూటకో పార్టీ మారే వారిని పట్టించుకోవద్దని సూచించారు. మనకు అండగా నిలిచే కేసీఆర్కు మద్ధతుగా ఉండాలని పిలుపునిచ్చారు.
జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలోని జమ్మిచేడు వద్ద నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యకర్తలకు, నాయకులకు సభ్యత్వాన్ని అందజేశారు. రైతులకు అండగా నిలుస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని కొనియాడారు.
ఇదీ చూడండి: 'భాజపా, తెరాస కలిసి రైతులను మోసం చేస్తున్నాయి'