ETV Bharat / state

ప్రశాంతంగా కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు

తుంగభద్ర నదీ పుష్కరాలు నాలుగు రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కార్తిక సోమవారం కావడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నదీ హారతి కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు. ఏర్పాట్లను కలెక్టర్ ఓజా పరిశీలించి, శాంతి భద్రతలపై ఎస్పీతో చర్చించారు.

thungbhadra pushkaralu at alampur jogulamba gadwala
ప్రశాంతంగా కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు
author img

By

Published : Nov 23, 2020, 10:24 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐదో శక్తి పీఠం అలంపూర్​ జోగులాంబ ఆలయ సమీపంలో తుంగభద్ర పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు నాలుగో రోజున కార్తిక సోమవారం కావడం వల్ల భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వదిలారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. హారతి కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం సతీసమేతంగా హజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అలంపూర్ ఘాట్​లో 14,495 మంది, పుల్లూరు ఘాట్​లో 2,426 మంది, రాజోలి ఘాట్​లో 7,140 మంది, వేణిసోంపురం ఘాట్​లో 2,100 మంది భక్తులు పుష్కర స్నానమాచరించారు. పుష్కర ఘాట్​లను కలెక్టర్ శృతి ఓజా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కరోనా దృష్ట్యా పుష్కర ఘాట్ల వద్ద నిత్యం శానిటేషన్​ చేయాలని సూచించారు. దివ్యాంగులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పుష్కరఘాట్ల వద్ద వీల్​ఛైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ సమస్యలపై జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​కుమార్​తో చర్చించారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో భాజపాని గెలిపిస్తే రూ. లక్ష కోట్ల ప్యాకేజి ఇస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.