ETV Bharat / state

'వ్యవసాయ రంగంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ' - bharat bandh in jogulamba gadwal district

భారత్‌ బంద్‌కు మద్దతుగా జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారిని తెరాస శ్రేణులు దిగ్బంధం చేశాయి. రోడ్డుపై బైఠాయించి రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

pullur national highway blocked in view of bharat bandh
'వ్యవసాయ రంగంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ'
author img

By

Published : Dec 8, 2020, 2:21 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో భారత్‌ బంద్‌కు మద్దతుగా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని తెరాస శ్రేణులు దిగ్బంధం చేశాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకు వామపక్షాలు మద్దతు తెలిపాయి.

కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లేని పక్షంలో వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మంత్రి అన్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని.. నూతన చట్టాల ద్వారా వారిని అగాధంలోకి తోస్తోందని దుయ్యబట్టారు. 12 రోజులుగా దేశ రాజధాని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

రైతు గురించి ఆలోచించే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని.. వ్యవసాయ రంగంలో భారత దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ఇటువంటి చట్టాలు చేసి కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించడం సరికాదని హితవు పలికారు.

ఇదీ చదవండి: రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్: రాజాసింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.