ETV Bharat / state

కొత్త జలాశయం... రైతుల్లో అయోమయం!

ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కొత్త జలాశయ నిర్మాణానికి సర్కారు కసరత్తు చేస్తోంది! ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేసింది. ఇటీవలే విశ్రాంత ఇంజినీర్ల బృందం నివేదిక సిద్ధం చేసింది. అది రేపో, ఎల్లుండో సీఎం చేతికి చేరనుంది. అయితే... గట్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కొత్త జలాశయ నిర్మాణమనే చర్చ జోరుగా జరుగుతోంది. ఫలితంగా రైతుల్లో అయోమయం నెలకొంది.

New reservoir ... farmers confusion in jogulazmba district
కొత్త జలాశయం... రైతుల్లో అయోమయం!
author img

By

Published : Feb 13, 2020, 5:40 PM IST

కొత్త జలాశయం... రైతుల్లో అయోమయం!

జూరాలకు ఎగువన 20 టీఎంసీల జలాశయం.. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 20 టీఎంసీల సామర్థ్యంతో రూ. వెయ్యి కోట్ల అంచనాతో సాగు, తాగు, విద్యుత్ అవసరాలను తీర్చేవిధంగా కొత్త జలాశయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

జిల్లాలోని ధరూరు మండలంలో ఈ జలాశయాన్ని నిర్మించేందుకు విశ్రాంత ఇంజినీర్ల బృందం సభ్యులు సైతం అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్మాణానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేపట్టారు. త్వరలోనే ఆ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్​కు అందించనున్నారు.

రెండు పథకాలూ కొనసాగిస్తాం. ప్రతిఎకరాకూ సాగునీరు అందించేందుకే కొత్త ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తున్నాం. విపక్షాల ఆరోపణలు అవాస్తవం.

- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

గట్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కొత్త జలాశయం పేరు తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ అస్పష్ట విధానాలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. గట్టు ఎత్తిపోతల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. - డీకే అరుణ, మాజీ మంత్రి

ఇదీ అసలు సంగతి..

గతంలో 15 టీఎంసీల సామర్థ్యంతో గట్టు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. డీపీఆర్ సైతం సిద్ధమైంది. కానీ ప్రస్తుతం కొత్త జలాశయం ప్రతిపాదన ముందుకొచ్చింది. ర్యాలంపాడు జలాశయం నుంచే గట్టు, ధరూర్ సహా కరువు పీడిత ప్రాంతాలకు నీరందించాలని విశ్రాంత ఇంజినీర్ల బృందం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గట్టు ఎత్తిపోతల పథకం ఖర్చు సైతం అధికం. అందుకే తక్కువ ఖర్చుతో కొత్త జలాశయాన్ని నిర్మిస్తే.. ఎక్కువ మొత్తంలో వరద నీటిని ఒడిసిపట్టుకుని సాగు, తాగు, విద్యుత్ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని బృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గట్టు పథకంపై స్పష్టత కరువైంది.

నూతన జలాశయ నిర్మాణంపై స్థానికులు, విపక్షాల్లో అయోమయం నెలకొంది. గతంలో ప్రతిపాదించిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసి.. దాని బదులుగా నూతన జలాశయాన్ని నిర్మిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ.. రెండూ కొనసాగిస్తారా? లేక ఒకటే ముందుకెళుతుందా... అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఇదీ చూడండి:కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.