జోగులాంబ గద్వాల జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో ధరూరు, గట్టు, కేటిదొడ్డి, గద్వాల మండలాల్లో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లక్ష 38 వేల 277 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలోని పోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ కృష్ణ పరిశీలించారు.
ఇవీ చూడండి: కేరళ బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్