గద్వాల మండలం పూడూరు గ్రామంలో వారం రోజుల క్రితం చాకలి వెంకన్న మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతండగా పురాతనమైన బంగారు, వెండి నాణాలు లభ్యమయ్యాయి. జేసీబీతో రెండు గుంతలు తవ్వుతుండగా ఒక మట్టి పాత్ర బయటపడింది. అందులో పురాతనమైన 11 బంగారు నాణాలు, 19వెండి నాణాలు ఉన్నాయి.
ఎవరికి తెలియకుండా ఇంట్లో దాచిపెట్టాడు. కానీ..అధికారులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: అయోధ్య కేసు: జులై 25 నుంచి రోజూ విచారణ!