కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకమైనది. కార్తీక పౌర్ణమిలో నేడు చివరి సోమవారం కావడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. స్వామివారికి అభిషేకం చేయాలంటే నాలుగు గంటల వేచి చూడాల్సిందే. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలతోపాటు పాప నాసీశ్వర మరియు సంగమేశ్వర ఆలయాలను భక్తులు దర్శించుకుంటున్నారు.
ఇవీ చూడండి: 'మహారాష్ట్ర' వ్యవహారంపై తీర్పు రేపటికి వాయిదా