ETV Bharat / state

సీఎం కేసీఆర్​ ప్రధాని కావాలని యువకుడి పాదయాత్ర

author img

By

Published : Dec 21, 2022, 8:11 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రధాని కావాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు పాదయాత్ర చేపట్టాడు. వెంకటాపురం నుంచి ప్రగతి భవన్​ వరకు యాత్ర చేయనున్నట్లు తెలిపాడు. రాష్ట్రాన్ని రోల్ మోడల్​గా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధాని అయితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతో పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. తాపీ కార్మికుడిగా పని చేస్తున్న ప్రసాద్​.. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై పాదయాత్రకు పూనుకున్నాడు.

సీఎం కేసీఆర్​ ప్రధాని కావాలంటూ యువకుడి పాదయాత్ర
సీఎం కేసీఆర్​ ప్రధాని కావాలంటూ యువకుడి పాదయాత్ర
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.